కేరళలో కలకలం రేపుతున్న జికా వైరస్

కేరళలో కలకలం రేపుతున్న జికా వైరస్

తిరువనంతపురం: కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో తాజాగా.. కేరళలో జికా వైరస్ కేసులు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. గురువారం తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అంటే 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో జికా వైరస్ కనిపించిది. తిరిగి 1952లో మనుషుల్లో కనిపించింది. అటు తర్వాత చాలా గ్యాప్ తో 2017లో మనదేశంలోని తమిళనాడు, అహ్మదాబాద్ ప్రాంతాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు కేరళలో జికా వైరస్ బయటపడింది. 
వైరస్ కొత్తరకంగా కనిపిస్తుండడంతో అనుమానం వచ్చి శాంపిల్స్ ను పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. మొత్తం 19 కేసులు పంపగా.. వాటిలో 12 కేసులు జికా వైరస్ పాజిటివ్ గా తేలింది. అంతకు ముందు ఒకే ఒక కేసు బయటపడడంతో అనుమానించిన వైద్యులు అలాంటి లక్షణాలే ఉన్న వారు కనిపించాయి. ఏడెస్ అనే దోమ నుంచి సోకే  జికా వైరస్ 24 ఏళ్ల వయసున్న గర్భిణిలో బయటపడింది. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తూ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. జికా వైరస్ కు ప్రత్యేక మందులు లేకపోవడంతో ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధతో చికిత్స కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె ఈనెల 7న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డలో వైరస్ లక్షణాలు లేకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.